ఐటీ గ్రిడ్ కేసులో విచారణ ముమ్మరం ఐటీ గ్రిడ్స్ డేటా కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం ఇంఛార్జీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సమావేశమైంది.సిట్ సభ్యులను 3 ప్రత్యేక బృందాలుగా ఐజీ స్టీఫెన్ రవీంద్ర విభజించారు. డేటా విశ్లేషణ, డేటా రికవరీ కోసం ఒక బృందం, కేసులో అనుమానితులు, సాక్షుల విచారణ కోసం మరొక బృందాన్ని, ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ గాలింపు కోసం మరో బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఐజీ తెలిపారు. గూగుల్, అమెజాన్ సర్వీస్ యూజర్ల సమాచారం త్వరగా ఇవ్వాలని ఆ సంస్థలకు సిట్ లేఖ రాసింది.
ఇవీ చదవండి: 'టీకాతో చనిపోలేదు'