Sircilla Constituency Latest News : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. 2014 ముందు వరకు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వేర్వేరుగా ఉండేవి. దీంతో అభివృద్ధిలో వెనుకబడిపోయామన్న భావన స్థానికులకు ఉందేది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆ ఆనవాయితీ మారలేదు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్(ప్రస్తుత బీఆర్ఎస్) అభ్యర్థిగా సిరిసిల్లలో కేటీఆర్ గెలుపొందగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది.
Sircilla Assembly Election Results 2023 : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2014లో ఆ పరిస్థితి మారింది. వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగా, కేటీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో పాటు మంత్రిగానూ కొనసాగారు. అలాగే ప్రస్తుత ఎన్నికల ఫలితాలతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. సిరిసిల్ల నుంచి వరుసగా నాలుగోసారి కేటీఆర్ విజయం సాధించినా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాత ఆనవాయితీ కొనసాగినట్లు అయింది.
అభివృద్ధి కొనసాగాలని ఆకాంక్ష : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అప్పటి నుంచి బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్) అధికారంలో ఉండటం, సిరిసిల్ల ఎమ్మెల్యేగా కల్వకుంట్ల తారక రామారావు కొనసాగడంతో నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడు కావడం, పైగా మంత్రిగా కొనసాగుతూ గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో నిధులు తీసుకొచ్చి పనులు చేపట్టారు. జిల్లాగా మార్చడంతో పాటు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు.
KTR wins in Sircilla election results 2023 : సిరిసిల్ల నియోజకవర్గం రాష్ట్రంలోనే కాకుండా, దేశంలోనే గుర్తింపు వచ్చేవిధంగా విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో అవార్డులు అందుకునేలా కృషి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారంలోకి రాగా కేటీఆర్ ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు. దీంతో వచ్చే అయిదేళ్లలో సిరిసిల్లలో అభివృద్ధి మునుపటిలా సాగుతుందా అని స్థానికుల్లో చర్చ మొదలైంది. ప్రస్తుత కొత్త ప్రభుత్వం కూడా అభివృద్ధిని కొనసాగించాలని, సంక్షేమం దరిచేర్చాలని సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.
Sircilla Election Results 2023 : ఇక సిరిసిల్ల నియోజకవర్గం సింహభాగం గ్రామీణ ప్రాంతమే. ఇక్కడ 71.65 శాతం ఓటర్లు గ్రామీణ ప్రాంతానికి చెందినవారే కావడం విశేషం. 2014లో సిరిసిల్లలో మొత్తం 73.62 శాతం పోలింగ్ నమోదుకాగా, 53 వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి కొండూరు రవీందర్ రావును బీఆర్ఎస్(ఒకప్పటి టీఆర్ఎస్) అభ్యర్థి కేటీఆర్ ఓడించారు. ఇక 2018 ఎన్నికల్లో ఈ స్థానంలో 80.57 శాతం ఓటింగ్ నమోదు కాగా, కేటీఆర్‌కు 1,25,213 ఓట్లు అంటే మొత్తం ఓట్లలో 70.89 శాతం ఓట్లు వచ్చాయి. కేకే మహేందర్‌కు 36,204 ఓట్లు(21 శాతం) పోలయ్యాయి. ఇక 2023లో 77 శాతం ఓటింగ్ జరగ్గా సిరిసిల్ల గడ్డపై సత్తా చాటేదెవరన్నది స్థానికంగా ఆసక్తి రేపింది. కాగా, ఐదోసారి కూడా నేతన్నలు కేటీఆర్‌కే జై కొట్టారు. సిరిసిల్ల నియోజకవర్గంలో కేకే మీద కేటీఆర్ గెలుపొందారు.
Sircilla, Telangana Election Results 2023 Live : సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పాంచ్ పటాకా
KTR, Telangana Elections Results 2023 Live : కాంగ్రెస్‌కు గుడ్ లక్ - ఓడిపోయామని బాధగా ఉన్నా