ETV Bharat / state

Singareni: రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యం! - telangana news

సెప్టెంబరులో ఇప్పటి వరకు సింగరేణి సాధించిన ఉత్పత్తిపై హైదరాబాద్‌ సింగరేణి భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, అన్ని ఏరియాల జీఎంలతో సీఎండీ శ్రీధర్ సమీక్షించారు. ఈ నేపథ్యంలో వర్షాలతో కలిగిన నష్టాన్ని 15 రోజుల్లో పూడ్చుకోవాలని ఆదేశించారు.

singareni
singareni
author img

By

Published : Sep 17, 2021, 12:13 PM IST

ఇటీవల విదేశీ బొగ్గు ధర విపరీతంగా పెరిగింది. దీనితో దేశంలో విద్యుత్​ డిమాండ్​ గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో విదేశీ బొగ్గుపై ఆధారపడిన పరిశ్రమలు.. సింగరేణి లేదా కోలిండియా బొగ్గు కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధికోత్పత్తికి కృషి చేయాలని ఛైర్మన్​ అండ్​ మేనేజింగ్​ డైరెక్టర్​ ఎన్​. శ్రీధర్​ అన్ని ఏరియాల జనరల్​ మేనేజర్లను ఆదేశించారు.

లక్ష్యాలకు అనుగుణంగా ఉత్పత్తి

థర్మల్​ విద్యుత్​ కేంద్రాల్లోనూ.. ఒకటి రెండు రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ, ఇంధన మంత్రిత్వ శాఖల వారు బొగ్గు డిమాండ్​కు తగినట్లుగా ఉత్పత్తి చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి, రవాణాను సాధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

వీడియో కాన్ఫరెన్స్‌

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు జరుగుతున్న బొగ్గు రవాణాతో పాటు సెప్టెంబరులో ఇప్పటి వరకు సింగరేణి సాధించిన ఉత్పత్తిపై హైదరాబాద్‌ సింగరేణి భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, అన్ని ఏరియాల జీఎంలతో సీఎండీ శ్రీధర్ సమీక్షించారు. ఈ ఏడాది సింగరేణి చరిత్రలో అత్యధికంగా 70 మిలియన్‌ టన్నుల ఉత్పత్తిని సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఈ నేపథ్యంలో ఏరియా జీఎంలు తమ తమ ఏరియాలలో సమావేశాలు నిర్వహించి అందరిలో అవగాహన కల్పిస్తూ ఉత్పత్తి సాధించేలా కృషి చేయాలన్నారు.

రోజుకు 1.82 లక్షల టన్నులు

సింగరేణి సంస్థ సెప్టెంబరులో నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యానికి వర్షాల వల్ల మొదటి 15 రోజులు కొంత విఘాతం కలిగిందని తెలిపారు. రోజుకు 1.85 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించాల్సి ఉండగా 1.43 లక్షల టన్నులు మాత్రమే సాధించగలిగామని చెప్పారు. ఈ నేపథ్యంలో వర్షాలతో కలిగిన నష్టాన్ని 15 రోజుల్లో పూడ్చుకోవాలని ఆదేశించారు సీఎండీ శ్రీధర్. ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ రోజుకు కనీసం 1.82 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టినందున వచ్చే నెలలో ప్రతి రోజూ 1.85 లక్షల టన్నుల నుంచి 1.9 లక్షల టన్నులు, నవంబరు, డిసెంబరు నెలల్లో ప్రతీ రోజూ 2 లక్షల టన్నులు, చివరి త్రైమాసికమైన జనవరి నుంచి మార్చి నెలల్లో ప్రతీ రోజు 2.20 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణాని సాధించేందుకు సంసిద్ధం కావాలని స్పష్టం చేశారు. ఉత్పత్తి లక్ష్య సాధనకు అవసరమైన అన్నింటినీ సమకూర్చుతున్నట్లు వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.