హైదరాబాద్ జూబ్లీహిల్స్ సీఆర్‌పీఎఫ్ క్వార్టర్స్‌లో ఓ ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్వార్టర్స్‌లోని వినోద గదిలో రాజస్థాన్‌కు చెందిన భవానీ శంకర్ ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు. గమనించిన సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు.