రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో మానసిక వైద్య నిపుణులను తప్పనిసరిగా నియమించాలంటూ... హైకోర్ట్ న్యాయవాది రాపోలు భాస్కర్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థులు మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో జారీ చేసిన జీవో ఎంఎస్ నెం 19ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ జీవోను అమలు చేస్తూ... ఇంటర్, డిగ్రీ కాలేజీలలో మానసిక వైద్య నిపుణులను నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఎస్హెచ్చార్సీని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన హెచ్చార్సీ వచ్చే నెల 26లోగా నివేదిక సమర్పించాలంటూ... తెలుగు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.