ETV Bharat / state

ఆదినుంచే అరిగోసలు పడుతున్న కంది, సోయా రైతులు - Shortage of oat seeds

కంది, సోయా పంట వేయాలనుకునే రైతులకు ఆది నుంచే కష్టాలు మెుదలయ్యాయి. సోయా విత్తనాలకు దేశవ్యాప్తంగా కొరత ఉండడంతో వ్యాపారులు ధరలు పెంచారు. మరికొందరు వ్యాపారులు నాసిరకం, పాత విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ప్రభుత్వం రాయితీపై విత్తనాలు అందిస్తామని చేప్పినప్పటికీ పంట వేసే సమయానికి పంపిణీని విరమించుకుంది.

రాష్ట్రంలో విత్తనాల కొరత
రాష్ట్రంలో విత్తనాల కొరత
author img

By

Published : Jun 29, 2021, 8:08 AM IST

రాష్ట్రంలో కంది, సోయా విత్తనాల కొరత రైతులను వేధిస్తోంది. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు పెంచడంతో పాటు నాసిరకం, పాత విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ఈ ఏడాది కంది సాగు పెంచాలని వ్యవసాయశాఖ పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నా.. ఆ మేర విత్తనాలను సేకరించలేదు. తాజాగా టెండర్లు పిలిచింది. సోయా విత్తనాలకు దేశవ్యాప్తంగా కొరత ఉందని చెబుతూ రాయితీపై పంపిణీని విరమించుకుంది.

* గతేడాది క్వింటా కంది విత్తనాలను రూ.8,393కి విక్రయించగా, ఇప్పుడు కొరత పేరుతో ప్రభుత్వమే రూ.9,270గా నిర్ణయించింది. బహిరంగ మార్కెట్‌లో రూ.9,500 నుంచి 10 వేల వరకూ వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో సాగుకు 20 వేల క్వింటాళ్లకు పైగా కంది విత్తనాలు అవసరం కాగా.. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వద్ద 1900 క్వింటాళ్లు మాత్రమే ఉన్నాయి. ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ‘ఉజ్వల’(పీఆర్‌జీ-176) రకం కంది మూల విత్తనాలను క్వింటా రూ.18 వేలకు అమ్ముతోంది. దీంతో వచ్చే పంటను రెండేళ్లు విత్తుగా ఉపయోగించుకోవచ్చు.

* సోయా విత్తనాలను క్వింటా రూ.9,100కు ఇస్తామని తొలుత ప్రైవేటు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని, సీజన్‌ ఆరంభమయ్యే సమయానికి చేతులెత్తేశాయి. కొరత నేపథ్యంలో వ్యాపారులు మహారాష్ట్ర నుంచి పాత విత్తనాలను తెప్పించి క్వింటాకు రూ.10,500 నుంచి 11,700కు విక్రయిస్తున్నాయి. ఆదిలాబాద్‌లో 30 కిలోల విత్తన సంచిపై (గత ఏడాదివి) ధర రూ.3,100 ఉండగా దాన్ని స్కెచ్‌ పెన్‌తో రూ.3,900గా దిద్ది అమ్ముతున్న ఓ దుకాణం లైసెన్సును అధికారులు రద్దు చేశారు. ఇక్కడే మరో దుకాణంలో అమ్మిన ఓంకార్‌ సీడ్స్‌ కంపెనీ సోయా విత్తనాలు 100 నాటితే 30 మొలకలే వచ్చాయని, రైతు ఫిర్యాదు చేయడంతో దుకాణ లైసెన్స్‌ను ఈ నెల 11న వ్యవసాయశాఖ రద్దు చేసింది. మళ్లీ 4 రోజులకే అనుమతించింది.

ఇదీ చదవండి: POWER WAR: ఇరురాష్ట్రాల మధ్య విద్యుత్​ పంచాయితీగా మారిన జల వివాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.