ETV Bharat / state

గతంలో ఓటు వేశాను... ఇప్పుడెందుకు లేదు?

ఒక పౌరురాలిగా నేను మోసపోయాను. నా ఓటు ముఖ్యం కాదా? అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఓటు వేశాను. ఈసారి ఎలా గల్లంతవుతుంది : శోభన కామినేని

ఓటు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన శోభన కామినేని
author img

By

Published : Apr 11, 2019, 12:50 PM IST

అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్ శోభన కామినేని ఓటర్ జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని మాసబ్ ట్యాంక్​లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లగా... ఓటు లేదని వాపోయారు. ముందుగా చూసుకున్నప్పుడు తన పేరు ఆ నియోజకవర్గంలో ఉందని, తీరా ఇప్పుడు లేకపోవడమేంటని ప్రశ్నించారు. ఓటు వేసేందుకు విదేశాలకు వెళ్లిన తాను ఇక్కడకు వచ్చానని ఆమె తెలిపారు. ఇది చాలా దారుణమని, ఈ విషయాన్ని ఇలా వదిలేయనని శోభన హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.