ప్రముఖ సినీ గేయ రచయిత డా.శివ గణేశన్ కన్ను మూశారు. గుండెపోటుతో హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళంలో వెయ్యికిపైగా సినిమాలకు పాటలు రాసిన శివ గణేశన్...సినిమా సాహిత్యంలో పీహెచ్ఎడీ పూర్తి చేశారు. ప్రేమికుల రోజు, నరసింహా, జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్, ఎంతవారు కాని, ఉల్లాసం, 7జీ బృందావన్ కాలనీ, ఆస్తి మూరెడు- ఆశ బారెడు తదితర చిత్రాలకు పాటలు రచించారు.
దక్షిణాదిన శివ గణేశన్ ఎంతో పేరు తెచ్చుకున్నారు. కమల్ హాసన్, రజినీ కాంత్, అర్జున్ లాంటి అగ్ర కథానాయకులకే కాకుండా పలు చిన్న సినిమాలకు కూడా పాటలు రాశారు. ప్రముఖ దర్శక,నిర్మాతలు ఏఎం రత్నంతో శివగణేశన్కు ఆత్మీయ అనుబంధం ఉందని కోలీవుడ్ చిత్ర పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. మృతుడికి భార్య నాగేంద్రమణి, ఇద్దరు కుమారులు సుహాస్, మానస్ ఉన్నారు. అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, పరిశ్రమ సహచరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగ నియామకాలు: కేసీఆర్