ఇవీ చూడండి : చరిత్రే చిన్నబోతోంది... ఆ రణభూమికి ఇప్పుడేమైంది!?
భాజపాకు షిర్డీలోని తెలుగు వారి మద్దతు - మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు
తెలుగు రాష్ట్రాల నుంచి వ్యాపార నిమిత్తం షిర్డీ వెళ్లి అక్కడే స్థిరపడిన నాలుగు వందల తెలుగు వారు భాజపాకు మద్దతు ప్రకటించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అహ్మాదాబాద్ జిల్లా షిర్డీ నియోజకవర్గ కమలం పార్టీ అభ్యర్థి రాధాకృష్ణ విఖే పాటిల్‌కు షిర్డీ తెలుగు సమాజ్ సంపూర్ణ మద్దతు తెలిపింది.
భాజపాకు షిర్డీలోని తెలుగు వారి మద్దతు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అహ్మాదాబాద్ జిల్లా షిర్డీ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రాధాకృష్ణ విఖే పాటిల్‌కు షిర్డీ తెలుగు సమాజ్ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్, అహ్మద్‌నగర్ ఎంపీ సుజయ్ విఖే పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. షిర్డీలో 2 వేల మందికిపైగా తెలుగు ప్రజలున్నారు. ఇందులో నాలుగు వందల మందికి మహారాష్ట్రలో ఓటు హక్కు ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి వ్యాపార నిమిత్తం షిర్డీ వెళ్లి.. అక్కడే స్థిరపడిన తెలుగువారికి మహారాష్ట్ర ఓటరు జాబితాలో చోటు దక్కింది. వారంతా భాజపా అభ్యర్థి రాధాకృష్ణ విఖే పాటిల్‌కు తమ మద్దతు తెలిపారు.
ఇవీ చూడండి : చరిత్రే చిన్నబోతోంది... ఆ రణభూమికి ఇప్పుడేమైంది!?
Intro:Body:Conclusion: