యువత అధిక సంఖ్యలో ఉండటం మన దేశ పురోగతికి ఎంతో దోహదపడుతోందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. ప్రతి ఒక్కరూ నైపుణ్యాలు మెరుగుపర్చుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళాను సీపీ అంజనీ కుమార్ ప్రారంభించారు.
హైదరాబాద్ మహానగరం ప్రపంచ స్థాయిలో ఎంతో పేరొందిందని పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో న్యూయార్క్ కంటే హైదరాబాద్ మెరుగైన స్థితిలో ఉందని తెలిపారు. టీఎమ్ఐ ఫౌండేషన్ సహకారంతో షీటీమ్ పోలీసుల ఆధ్వర్యంలో కేవలం యువతుల కోసం ఉద్యోగ మేళా నిర్వహించారు.
దాదాపు 40కి పైగా కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. 5వేల మందికి పైగా యువతులు దరఖాస్తు చేసుకున్నారు. యువత నైపుణ్యాల ఆధారంగా కంపెనీల ప్రతినిధులు ముఖాముఖి నిర్వహించి ఉద్యోగాల్లో నియమించుకున్నారు. ఉద్యోగాలకు ఎంపికైన యువతులకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ నియామక పత్రాలు అందించి అభినందించారు.
ఇదీ చదవండి: బిట్టు శ్రీను కస్టడీ కోసం మంథని కోర్టులో పోలీసుల పిటిషన్