Airport Metro Route Map Examine Metro Engineering Officials: మెట్రో రెండో దశకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రూట్ మ్యాప్‌ను మెట్రో ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించారు. ఎయిర్పోర్ట్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఇంజినీరింగ్ అడ్వైజర్, రైల్వే బోర్డు మాజీ మెంబర్ ఇతర ఇంజినీరింగ్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి పలు ఆసక్తిగల విషయాలు చెప్పారు.
మెట్రో లైన్ వెళ్లే రాయదుర్గం స్టేషన్ నుంచి నానక్ రామ్ గూడ జంక్షన్ వరకు ఉన్న భాగం ఇంజినీరింగ్ పరంగా అతి క్లిష్టమైందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇక్కడ సాంకేతిక సవాళ్లను ఎదుర్కొక తప్పదని భావించారు. అందుకే ఉత్తమమైన ఇంజినీరింగ్ పరిష్కారాలను సూచించేందుకు తనిఖీలు నిర్వహించామన్నారు. అయితే ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చిందని.. 21 మీటర్ల ఎత్తులో మైండ్ స్పేస్ జంక్షన్‌ను దాటడం ఒక పెద్ద సవాల్‌తో కూడుకున్న విషయంగా ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రాంతంలో కింద నుంచి అండర్‌పాస్ వే.. మధ్యలో రోటరీ.. ఆ పైన ఫ్లైఓవర్ ఒకదాని మీద ఒకటి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అడ్డంకిని దాటేందుకు పరిష్కారంగా ప్రత్యేకమైన స్పాన్‌ని.. అక్కడే నిర్మించేలా పరిశీలించాలని వెల్లడించారు. అయితే ఇది ఎంతవరకు ఫలిస్తుందో చూడాలన్నారు. ఈ మెట్రో లైన్ వెళ్లే ఎయిర్‌పోర్టు మెట్రో పిల్లర్లను ఫ్లైఓవర్ పిల్లర్లకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలని మెట్రో ఎండీ తెలిపారు.
మెట్రోకు భారీ కేటాయింపు: నాగోల్- రాయదుర్గం కారిడార్ 3కు కొనసాగింపుగా.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రోను విస్తరించనున్నారు. ఈసారి రాష్ట్రం ప్రభుత్వం సొంత నిధులతోనే రాయదుర్గం నుంచి మొదలై శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. అయితే మెట్రోను శంషాబాద్ విమానాశ్రయంతో కనెక్టివిటీ చేయనున్నారు. మొత్తం రూ.6250 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖర్చులతో మూడేళ్లలో పూర్తి చేయనుందని అధికార వర్గాల సమాచారం. ఈ గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన సీఎం కేసీఆర్ ఈ మెట్రో లైన్‌కు శంకుస్థాపన చేశారు.
ఇవీ చదవండి: