Omicron Cases in AP: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి చేరుకుంది. ఒమిక్రాన్ సోకిన వారిలో ఒమన్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు, దుబాయ్ నుంచి ఇద్దరు, అమెరికా, సుడాన్, గోవా నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు.
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు..
ap corona cases: మరో వైపు ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 28,311 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 334 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి మరో 95 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,516 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో భారీగా కరోనా కేసులు..
India Covid Cases: దేశంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 37,379 కేసులు వెలుగుచూశాయి. మరో 124 మంది ప్రాణాలు కోల్పోయారు. 11,007 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
Vaccination in India: దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. సోమవారం మరో 99,27,797 డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,46,70,18,464 కు చేరింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 13లక్షల 32వేల 854 కేసులు వెలుగులోకి వచ్చాయి. 2,952 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: Omicron effect on Children: 'పిల్లలపైనా ఒమిక్రాన్ ప్రభావం.. బాధితుల్లో 22 శాతం చిన్నారులే'