గాంధీ ఆస్పత్రిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఆస్పత్రిలో జరుగుతున్న పరిమాణాలను చిత్రీకరించేందుకు దవాఖానాకు వెళ్లిన మీడియా ప్రతినిధులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్న సందర్భంలో ఇరువురికి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం సెక్యూరిటీని దాటుకుని సూపరింటెండెంట్ కార్యాలయానికి చేరుకున్న మీడియా ప్రతినిధులు .. జరిగిన ఘటనకు సంబంధించి ఆయనను ప్రశ్నించగా తనకు ఆ విషయం తెలియదని పేర్కొన్నారు.
ఇటీవల ఆస్పత్రి ప్రాంగణంలో హల్చల్ చేసిన వైద్యుడు వసంత్ మరోమారు ఆస్పత్రి ప్రాంగణానికి వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో భద్రత కట్టుదిట్టం చేశామని వివరణ ఇచ్చారు. ఆస్పత్రిలో ఎలాంటి అవకతవకలు జరగటం లేదని... పారిశుద్ధ్యం, వైద్య విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌కి సంబంధించి వస్తున్న ఆరోపణపై పూర్తి నివేదికను ఇవాళ డీఎంఈకి అందించనున్నట్టు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో వైద్యవిద్యను పూర్తి చేసి.. గాంధీకి వస్తున్న ట్రాన్స్‌ఫర్డ్ ఇంటర్న్‌ల సంఖ్య తగ్గుతోందని.. అందుకు ప్రధాన కారణం గాంధీలో ఇంటర్న్‌షిప్ విషయంలో చాలా పటిష్ఠమైన చర్యలు ఉండటమే అంటూ వివరించారు.