దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయని.. కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆచరణలో పెట్టిన ఏకైక పార్టీ తెరాస మాత్రమేనని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. ఐటీ సెక్టార్, పరిశ్రమలు, గృహావసరాలకు, నీటిపారుదల ప్రాజెక్టులకు 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని స్పష్టం చేశారు. సికింద్రాబాద్‌లోని సీతాఫల్మండిలో జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తలసానితో పాటు హోంమంత్రి మహమూద్ అలీ, ఉప సభాపతి పద్మారావు పాల్గొన్నారు. తెలంగాణలో కాళేశ్వరం వంటి అతిపెద్ద ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఆ ఫలాలను ప్రజలకు అందిస్తుందన్నారు. ఈ నీటితో తెలంగాణ ప్రాంతమంతా సస్యశ్యామలవుతుందన్నారు. రాష్ట్రంలో 80వేల కోట్లతో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఉప సభాపతి పద్మారావు పేర్కొన్నారు. వాటిని ప్రజలకు చెంతకు చేర్చాలని కార్యకర్తలకు సూచించారు.
'రూ.80వేల కోట్ల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం'
సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, ఉపసభావతి పద్మారావు గౌడ్లు హాజరయ్యారు.