ETV Bharat / state

బీఆర్కే భవన్​లో సచివాలయ కార్యకలాపాలు షురూ - కార్యాలయాల తరలింపు

ఈరోజు నుంచి బూర్గుల రామకృష్ణారావు భవన్​లో సచివాలయ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. బీఆర్కే భవన్​లో తనకు ఏర్పాటు చేసిన  తన ఛాంబర్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి పనులు ప్రారంభించారు. పోలీసులు ట్రాఫిక్​ను పూర్తిస్థాయిలో గమనిస్తున్నారు.

బీఆర్కే భవన్​లో ప్రారంభమైన సచివాలయ కార్యకలాపాలు
author img

By

Published : Aug 13, 2019, 1:20 PM IST

Updated : Aug 13, 2019, 2:38 PM IST

బూర్గుల రామకృష్ణారావు భవన్ నుంచి సచివాలయ కార్యకలాపాలు షురూ అయ్యాయి. కార్యాలయాల తరలింపు పూర్తై కార్యదర్శులు ఇక్కడినుంచే తమ కార్యకలాపాలను ప్రారంభించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఈ ఉదయం బీఆర్కే భవన్​కు వచ్చి తన ఛాంబర్​ను పరిశీలించి కాసేపు అక్కడే ఉండి కుందన్​బాగ్​లోని క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి అదర్ సిన్హా, వైద్య ఆరోగ్య శాఖా కార్యదర్శి శాంతికుమారి తదితరులు బీఆర్కే భవన్​లోని తమ ఛాంబర్లకు వచ్చారు. పేషీలు ఇంకా పూర్తి స్థాయిలో తరలింపు పూర్తి కాకపోవడంతో కొంత మంది ఉద్యోగులు సచివాలయం నుంచే పని చేయనున్నారు. తరలింపు ప్రక్రియ ఇంకా కూడా కొనసాగుతోంది. మరోవైపు బీఆర్కే భవన్​లో మరమ్మతులు జరుగుతున్నాయి. ఇక్కడ పోలీసులు ట్రాఫిక్​ను పరిశీలించి వాహనాల రద్దీ, పార్కింగ్ తదితర విషయాలను గమనించారు. సచివాలయ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాక... పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.

బీఆర్కే భవన్​లో ప్రారంభమైన సచివాలయ కార్యకలాపాలు

ఇదీ చూడండి: ఇక నుంచి కార్యకలాపాలన్నీ బీఆర్కే భవన్​ నుంచే..

Intro:ఐటిడిఏ లో

Body:గవర్నింగ్ బాడీ సమీక్ష సమావేశం

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లోని ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ షైనీ ఆధ్వర్యంలో గవర్నింగ్ బాడీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు గత రెండేళ్ల తర్వాత ఐటీడీఏ పీవో గౌతమ్ చొరవతో ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ఈ సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య భద్రాచలం పినపాక కొత్తగూడెం అశ్వరావుపేట ఇల్లందు ఎమ్మెల్యేలు, పిఓ గౌతమ్ సబ్ కలెక్టర్ భవేశ్ మిశ్రా జిల్లాలోని జడ్పీటీసీలు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు గత రెండేళ్లుగా గాడితప్పిన గిరిజనాభివృద్ధి మెరుగుపరిచేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అనే విషయాల పై సమీక్ష నిర్వహిస్తున్నారు అయితే కలెక్టర్ మాట్లాడుతూ గతంలో కంటే గిరిజనుల్లో చాలా అభివృద్ధి కనబడుతుందని అన్నారు ఇంకా గిరిజనుల సమాజంలో అభివృద్ధి చేసేందుకు చేపట్టే కార్యక్రమాలపై సమీక్ష ఉంటుందని తెలిపారు
Last Updated : Aug 13, 2019, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.