ETV Bharat / state

సెంకడ్ వేవ్: పూల వ్యాపారులను దెబ్బకొట్టిన కరోనా

కరోనా కర్ఫ్యూ... పూల వ్యాపారాన్ని దారుణంగా దెబ్బకొట్టింది. కొనేవారు లేక పూల దుకాణాలు బోసిపోతున్నాయి. తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి. ఆంక్షల కారణంగా వ్యాపారం ముందుకు సాగడం లేదన్నది వ్యాపారుల మాట.

Flowers Business loss in ap
Flowers Business loss in ap
author img

By

Published : May 9, 2021, 10:19 AM IST

సెంకడ్ వేవ్: పూల వ్యాపారులను దెబ్బకొట్టిన కరోనా

గులాబీల గుబాలింపు, చామంతుల అందాలు, మల్లెల సువాసనలు... కరోనా దెబ్బకు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. కరోనా మహమ్మారి ఉద్ధృతితో ప్రజలు వివాహాలతో పాటు అన్ని రకాల శుభకార్యాలు వాయిదా వేసుకున్నారు. ఆలయాల్లో భక్తులకు అనుమతి లేదు. పుట్టినరోజు, పెళ్లిరోజులు చేసుకోవడం లేదు. అవసరమైతే తప్ప ఎవరూ మార్కెట్​కు రావడం లేదు. ఫలితంగా పూల వ్యాపారం కనిష్ఠ స్థాయికి పడిపోయింది.

ఏపీలోని గుంటూరు పూల మార్కెట్లో వ్యాపారులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్ఫ్యూ కారణంగా రైతుల నుంచి పూలు పెద్దగా రాని పరిస్థితి. ఉన్నకాడికి వ్యాపారం జరుగుతుందా అంటే అదీ లేదు. గతంలో రోజూ రెండు, మూడు క్వింటాళ్లు అమ్మిన వారికి ప్రస్తుతం 20కేజీలు అమ్మటం కష్టంగా మారింది. పూలపైన ఆధారపడిన వ్యాపారులు, కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

గుంటూరుకు ఇతర జిల్లాలతో పాటు బెంగళూరు నుంచి పూలు తెప్పిస్తుంటారు. పూలు అమ్ముడుపోక అవి మిగిలిపోతున్నాయి. ఒకట్రెండు రోజులకే పూలు పాడైపోయి తీవ్రనష్టం చవిచూస్తున్నారు. సాధారణంగా వివాహాలు, పూజలు, ఇతర శుభకార్యాలు ఎక్కువగా జరిగే సీజన్లోనే కరోనా విజృంభించటం పూలవ్యాపారులను దారుణంగా దెబ్బతీసింది.

దీనికితోడు లాక్​డౌన్ ఆంక్షలు వ్యాపారానికి ఆటంకంగా మారాయి. దుకాణాల వద్ద పూలు అల్లేవారు, దండలు కట్టేవారి పరిస్థితి మరీ దారుణం. రోజుకు 2 వందల సంపాదన లేదని వాపోతున్నారు. ఏళ్ల తరబడి ఇదే వ్యాపారాన్ని నమ్ముకున్న వారు వేరే పనులకు వెళ్లలేక నష్టాల్లోనూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఇలా ఎన్నిరోజులు వ్యాపారం చేయాలో అర్థంకాక బాధపడుతున్నారు.

ఇదీ చూడండి: దండిగా ఫండుంది.. స్పందనే లేదండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.