ETV Bharat / state

ఎప్పటికప్పుడు వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా పరిశీలన: ఎస్​ఈసీ

జీహెచ్​ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ పార్థ సారధి తెలిపారు. అన్ని పోలింగ్​ కేంద్రాల్లో ఓటింగ్​ ప్రారంభమైందని.. కొవిడ్​ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు పెట్టుకుని వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

sec-parthasarathi-said-observation-through-webcasting-from-time-to-time
ఎప్పటికప్పుడు వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా పరిశీలన: ఎస్​ఈసీ
author img

By

Published : Dec 1, 2020, 11:34 AM IST

గ్రేటర్​ పోలింగ్‌ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఎప్పటికప్పుడు వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా పరిశీలిస్తోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ పార్థ సారధి తెలిపారు. మొత్తం 2 వేల 272 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మరో 15 వందలకుపైగా కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను నియమించామని వెల్లడించారు. ఈ ఎన్నికలు చాలా ప్రధానమని.. ఓటర్లు ఓటు వజ్రాయుధాన్ని వినియోగించుకోవాలని కమిషనర్​ సూచించారు.

భౌతిక దూరాన్ని పాటించేలా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయిన వాళ్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు.

పోలింగ్ కోసం 28 వేలా 683 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. ఓటరు గుర్తింపు కోసం డివిజన్‌కు ఒకటి చొప్పున.. 150 పోలింగ్ కేంద్రాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. మొబైల్ యాప్ ద్వారా ఫేసియల్ రికగ్నైజేషన్ విధానంలో ఓటర్ల గుర్తింపు ప్రక్రియ చేపడుతున్నారు. అందుకు సరిపడా పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశారు.

ఇదీ చూడండి : ఓటు హక్కు వినియోగించుకున్న అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.