అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జియాగూడ సబ్జీ మండిలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో 'సీ ఫుడ్ ఫెస్టివల్' ఏర్పాటు చేశారు. మూడు రోజులు జరిగే కార్యక్రమంలో స్థానిక గంగపుత్ర మహిళలు 40 రకాల చేపల వంటకాలు ప్రదర్శించనున్నారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో పాటు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ పాల్గొన్నారు. ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు ఫుడ్ ఫెస్టివల్ జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష