ETV Bharat / state

Mission Kakatiya Scotch Award: మిషన్ కాకతీయకు మరో అరుదైన గౌరవం... - తెలంగాణ వార్తలు

మిషన్ కాకతీయకు(mission kakatiya scheme) మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ పథకంలో భాగంగా ఉన్న చెరువులన్నింటినీ ఆన్​లైన్​లో పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన సాఫ్ట్ వేర్​కు స్కాచ్ అవార్డ్(Scotch Award) లభించింది. ఇది మిషన్ కాకతీయకు దక్కిన రెండో అవార్డు అని ఈఈ రామాచారి తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో అద్భుత ఫలితాలు సాధించినందుకే ఈ అవార్డులు దక్కుతున్నాయని పేర్కొన్నారు.

Mission Kakatiya Scheme
Mission Kakatiya Scheme
author img

By

Published : Nov 14, 2021, 9:51 PM IST

మిషన్ కాకతీయలో(mission kakatiya scheme) భాగంగా ఉన్న చెరువులన్నింటినీ ఆన్​లైన్​లో పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన సాఫ్ట్​వేర్​​కు స్కాచ్ అవార్డ్(Scotch Award) లభించింది. శనివారం రోజు జరిగిన కార్యక్రమంలో ఈఈ రామాచారి ఈ అవార్డును స్వీకరించారు. చిన్ననీటి వనరులకు పూర్వవైభవం తేవాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టారు. ఈ పథకంలోని చెరువులన్నింటినీ ఆన్​లైన్​లో పర్యవేక్షించేందుకు సాగునీటి శాఖకు చెందిన ఈ గవర్నమెంట్ డివిజన్ వారు ఒక సాఫ్ట్​వేర్​ను అభివృద్ధి చేశారు. దీనికి ఇంజినీర్‌ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ మార్గ నిర్దేశం చేయగా.. ఈఈ రామాచారి నేతృత్వంలోని డివిజన్ ఇంజినీర్లు అభివృద్ధి చేశారు. ఇది మిషన్ కాకతీయకు దక్కిన రెండో అవార్డు అని ఈఈ రామాచారి తెలిపారు. 2018లో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇరిగేషన్ ... బెస్ట్ ఇరిగేషన్ ప్రాక్టీస్ కేటగిరీలో మిషన్ కాకతీయకు అవార్డును వచ్చింది.

2018లో బెస్ట్ ఇరిగేషన్ ప్రాక్టీస్ కేటగిరీలో అవార్డు..

తెలంగాణ ప్రభుత్వ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం (mission kakatiya scheme) దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. రాష్ట్ర వ్యవసాయానికి సాగునీరు అందించడంతో పాటుగా గొలుసుకట్టు చెరువుల విధానానికి పూర్వ వైభవం తీసుకువచ్చే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం 2018లో కేంద్ర ప్రభుత్వ అవార్డుకు ఎంపికయ్యింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అవార్డుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నీటిపారుదల శాఖను ఎంపిక చేసింది.

చెరువుల పూర్వ వైభవమే లక్ష్యంగా..

తెలంగాణలో ఉన్న గొలుసుకట్టు చెరువుల విధానానికి పూర్వ వైభవం తీసుకువచ్చి...రాష్ట్రంలోని చెరువులు, కాలువలు నీటితో కళకళలాడాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) 2015, మార్చి 12న కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లోని పాత చెరువులో మిషన్ కాకతీయ పథకానికి(mission kakatiya scheme) శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాకతీయ రాజులు ఈ ప్రాంతంలో గొలుసుకట్టు చెరువులను తవ్వించారు. అందుకే వారి గుర్తుగా ఈ ప్రాజెక్టుకు మిషన్ కాకతీయ అని పేరు పెట్టారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గల 46 వేలకుపైగా చెరువులను మళ్లీ పునరుద్ధరించారు. ప్రతి ఏడాది వర్షాకాలానికి ముందు ఎంపిక చేసిన చెరువుల్లో పూడిక తీసి... ఆ మట్టిని రైతులు పొలాల్లో చల్లుకోడానికి ఉచితంగా అనుమతిస్తారు. ఈ పథకం విజయవంతం కావడంతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. మిషన్ కాకతీయను(mission kakatiya scheme) సర్వత్రా హర్షించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు, అవార్డులు లభించాయి.

ఇదీ చదవండి: రూ.లక్ష ఇస్తే గల్ఫ్​కు పంపిస్తా.. లేదంటే బంగారం ఇస్తా.. బాధితులు ఏం చేశారంటే.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.