ETV Bharat / state

22న చెకుముకి సైన్స్ ప్రదర్శన.. విద్యార్థులకు అవగాహన - తెలంగాణ ప్రజా సంస్కృతి కేంద్రం

సమకాలీన సమాజంలో సైన్స్ పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ నెల 22న చెకుముకి సైన్స్‌ సంబురాలను నిర్వహించనున్నట్లు జన విజ్ఞాన వేదిక పేర్కొంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు 15వ తేదీ సాయంత్రం 5గంటలలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.

Science Exhibition on 22nd conducting by jana vignana vedhika
22న చెకుముకి సైన్స్ ప్రదర్శన.. విద్యార్థులకు అవగాహన
author img

By

Published : Feb 10, 2021, 7:20 PM IST

శాస్త్ర, సాంకేతికత పరంగా సమాజాన్ని, విద్యార్థులను మరింత ముందుకు తీసుకెళ్లడానికి చెకుముకి సైన్స్‌ సంబురాలను నిర్వహించనున్నట్లు జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి రావుల వరప్రసాద్ పేర్కొన్నారు. ఈ నెల 22న నిర్వహించే వేడుకల పోస్టర్‌ను హైదరాబాద్ బాగ్‌ లింగంపల్లిలోని తెలంగాణ ప్రజా సంస్కృతి కేంద్రంలో ఆవిష్కరించారు.

విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించడంతో పాటు వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వరప్రసాద్‌ వివరించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు 15వ తేదీ సాయంత్రం 5గంటలలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని.. కన్వీనర్ ఆదినారాయణ సూచించారు.

ఇదీ చదవండి: పాఠశాలకు చేరుకున్న విద్యార్థులు.. మొదలైన పాఠాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.