ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించనున్నట్లు కేంద్రానికి అధికారులు విన్నవించారు. ఈనెల 15న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాఠశాలల సురక్షిత ప్రణాళికపై కేంద్రం ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా పాఠశాలలను పునఃప్రారంభించే సమయాలను తెలపాాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. వీడియో కాన్ఫరెన్స్లో వెల్లడించిన వివరాల్లో ఏమైనా మార్పులు ఉంటే తెలపాలని రాష్ట్రాలకు కేంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతునందున్న మొదట ప్రకటించినట్లు ఏపీలో ఆగస్టు 3 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ఉండదు. బిహార్, దిల్లీ వంటి రాష్ట్రాలు సైతం ఆగస్టులోనే తెరవనున్నట్లు వెల్లడించాయి. తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు.
ఇదీ చదవండి: అనుబంధాలనూ వదలని మహమ్మారి