ETV Bharat / state

'ఆ పాఠశాల స్థలాన్ని మాకే అప్పగించండి'

హైదరాబాద్ ఖైరతాబాద్​లోని ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్​లోని పాత పాఠశాల స్థలాన్ని తమకే అప్పగించాలని స్థానికులు ఆందోళకు దిగారు. లేని పక్షంలో ఆమరణ దీక్షలు చేస్తామని.. అఖిల పక్ష పార్టీల నాయకులు ఆధ్వర్యంలో స్థలం ముందు నిరసన చేపట్టారు.

school-land-issue-local-protest-in-khiratabadh
'ఆ పాఠశాలని స్థలాన్ని మాకే అప్పగించండి'
author img

By

Published : Jul 28, 2020, 7:30 PM IST

హైదరాబాద్​ ఖైరతాబాద్​లోని ఓల్డ్​ సీఐబీ క్వార్టర్స్​లో 1981లో మహ్మద్ అహ్మద్ అనే వ్యక్తికి చెందిన స్థలంలో ఇక్కడ ప్రభుత్వ పాఠశాల నిర్మించారని ఆ తర్వాత ఆరు దశాబ్దాల పాటు 1998 వరకు అక్కడ పాఠశాల కొసాగిందని స్థానికులు తెలిపారు. అయితే 1981లో కావూరి ప్రొగ్రెసివ్ కన్​స్ట్రక్షన్ కంపెనీ ఆ స్థలాన్ని కొనుగోలు చేసిందని.. అప్పటి కలెక్టర్​కు పాఠశాల స్థలాన్ని తమకు అప్పగించాలని లేదా బహిరంగ వేలం వేస్తే దానిని స్థానికులంతా కలిసి కొనుగోలు చేస్తామని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు.

కానీ కొద్ది సంవత్సరాల తర్వాత కంపెనీ ఆ స్థలంపై తీసుకున్న అప్పుల చెల్లించకపోవడం వల్ల ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంకు దాన్ని ఆన్​లైన్​లో వేలం వేసిందని తెలిపారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ చొరవ తీసుకొని ప్రజల తరఫున మాట్లాడితే బ్యాంకు అధికారులను దూషించారంటూ సామాజిక మాద్యమాల్లో కొందరు తప్పుడు ప్రచారం చేశారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా బహిరంగ వేలం నిర్వహిస్తే... స్థానిక ప్రజలందరూ చందాలు వేసుకొని కొనుగోలు చేస్తామని బ్రేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఛైర్మన్ అనిల్​కుమార్​ తెలిపారు. ఆ స్థలంలోనే ప్రభుత్వ పాఠశాలను నిర్మించుకుంటామన్నారు. స్థలాన్ని అప్పగించకుంటే ఆమరణ దీక్షకు వెనుకాడమని తెలిపారు

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.