ETV Bharat / state

ఉపాధ్యాయుల ఆస్తులపై పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు

author img

By

Published : Jun 25, 2022, 4:24 PM IST

Updated : Jun 25, 2022, 4:53 PM IST

16:21 June 25

ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు

ఉపాధ్యాయుల ఆస్తులపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ పరిధిలో పని చేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. స్థిర, చరాస్తుల క్రయ విక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇటీవల నల్గొండ జిల్లా దేవరకద్ర మండలం గుంటిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావీద్‌ అలీపై ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

జావీద్ అలీ పాఠశాల విధులకు హాజరు కాకుండా రాజకీయ కార్యకలాపాలు, స్థిరాస్తి వ్యాపారాలు, వక్ఫ్​ బోర్డు సెటిల్​మెంట్లలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని 2021లో ఆరోపణలు వచ్చాయి. విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్.. జావీద్ అలీపై ఆరోపణల్లో చాలా వరకు నిజమేనని నిర్ధారించింది. శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. జావీద్ అలీపై చర్యలతో పాటు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉద్యోగులందరికి సంబంధించి ఉత్తర్వులు ఇవ్వాలని గతేడాది ఏప్రిల్​లో విజిలెన్స్ సిఫార్సు చేసింది. సిబ్బందికి బయో మెట్రిక్ హాజరు ఉండాలని సూచించింది. సిబ్బంది ఏటా ఆస్తుల వివరాలు సమర్పించడంతో పాటు స్థిర, చరాస్తుల క్రయ విక్రయాలకు ముందస్తు అనుమతి పొందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ నివేదిక సిఫార్సు మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవీ చూడండి..

భాగ్యనగరవాసులకు శుభవార్త.. అందుబాటులోకి రానున్న ఫుట్​ఓవర్​ బ్రిడ్జ్​లు!

ఐఏఎస్ కుమారుడి ఆత్మహత్య.. షాట్​గన్​తో కాల్చుకొని..

Last Updated : Jun 25, 2022, 4:53 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.