డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షల కోసం కళాశాల వసతి గృహాలను తెరవాలని ఎస్సీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులను అనుమతించాలని జిల్లా సంక్షేమాధికారులకు ఎస్సీ సంక్షేమ శాఖ సంచాలకురాలు యోగితా రాణా ఆదేశాలు జారీ చేశారు.
కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని.. విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా ఒక్కో గదిలో పరిమిత సంఖ్యలో విద్యార్థులను అనుమతించాలన్నారు. విద్యార్థుల హాజరు ఎప్పటికప్పుడు నమోదు చేయడంతో పాటు ఎవరైనా అనారోగ్యంగా కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని... ప్రత్యేక పౌష్టికాహారం అందించాలని సూచించారు. వసతి గృహాల పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని చెప్పారు.
ఇదీ చూడండి : నా పేరు మీద వచ్చే సందేశాలకు స్పందించకండి: సీఐ