Ambedkar Statue: రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గుజరాత్లో పర్యటించారు. గుజరాత్‌లోని నర్మదా వ్యాలీలో నెలకొల్పిన భారత తొలి ఉపప్రధాని సర్దార్ వల్లబ్బాయ్ పటేల్ (Statue Of Unity) విగ్రహాన్ని సందర్శించారు. నర్మదా నది లోయలోని కేవాడియా వద్ద సాధూబెట్ అనే చిన్న దీవిలో 597 అడుగుల సర్దార్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఇందుకోసం 2 వేల కోట్లకు పైగా ఖర్చుచేశారు.
హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 125 అడుగల విగ్రహ ఏర్పాటులో భాగంగా మంత్రి కొప్పుల ఈశ్వర్, అధికారులు గత రెండు రోజులుగా దిల్లీ పరిసరాల్లో ఉన్న పలు విగ్రహ తయారీ సంస్థలను సందర్శించారు.
ఇవాళ గుజరాత్‌లోని సర్దార్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు. పటేల్ జీవిత చరిత్రకు సంబంధించిన ఫొటో గ్యాలరీ, ప్రదర్శనశాల, లేజర్‌షోలను మంత్రి తిలకించారు. ఈ సందర్భంగా విగ్రహ ఏర్పాటు, ఇతర అంశాలను అక్కడి అధికారులను అడిగి మంత్రి కొప్పుల తెలుసుకున్నారు. విగ్రహ నిర్వహణ, అక్కడి పరిసరాలు ఇతర అంశాలను పరిశీలించారు.
ఇదీచూడండి: వైభవంగా సహస్రాబ్ది ఉత్సవాలు.. 108 దివ్యదేశాలను దర్శించుకున్న రాజ్‌నాథ్‌సింగ్