ETV Bharat / state

అంబేడ్కర్​ ఆశయ సాధనే సీఎం కేసీఆర్ లక్ష్యం: మంత్రి కొప్పుల - మంత్రి కొప్పుల ఈశ్వర్​ తాజా వార్తలు

బడుగు బలహీన వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు ప్రసాదించిన మహనీయుడు బాబా సాహెబ్​ అంబేడ్కర్ అని రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆయన 130వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రవ్యాప్తంగా 268 గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ambedkar 130th birthday
అంబేడ్కర్ 130వ పుట్టిన రోజు వేడుకులు
author img

By

Published : Apr 13, 2021, 5:40 PM IST

జీవితాంతం కుల వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన మహానీయుడు బీఆర్​ అంబేడ్కర్ అని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఆయన 130వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అంబేడ్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని చెప్పారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించి.. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ప్రసాదించిన మహానీయుడు అంబేడ్కర్ అని మంత్రి కొప్పుల అన్నారు. రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ. 1000 కోట్లతో కొత్తగా "సీఎం దళిత్​ ఎంపవర్​మెంట్​ ప్రోగ్రాం" ను రూపొందించారని మంత్రి తెలిపారు. ఎస్సీలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రవ్యాప్తంగా 268 గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా 175 అడుగుల ఎత్తుతో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొప్పుల తెలిపారు. కొత్తగా నిర్మిస్తోన్న అసెంబ్లీ భవనం సమీపంలోనే ఆ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నామని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలను భావితరాలు తెలుసుకునేందుకు, స్ఫూర్తి పొందేందుకు బోరబండలో "సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్" ను నిర్మిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: సాగర్ ప్రచారంలో మంత్రిని నిలదీసిన ప్రైవేట్ టీచర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.