ఏపీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో 144 సెక్షన్ కొనసాగుతోంది. తాడిపత్రిలో ఘర్షణ నేపథ్యంలో పోలీసుల మోహరించారు. గురువారం జేసీప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ, రాళ్ల దాడి జరిగింది. తెదేపా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కులం పేరుతో దూషించారని తాడిపత్రి పీఎస్‌లో వైకాపా కార్యకర్త మనోజ్ ఫిర్యాదుతో కేసు రిజిస్టర్ అయింది. ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డితో పాటు మరో ఆరుగురి పేర్లు ఇందులో ఉన్నాయి.
ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు