ETV Bharat / state

SBI Ladies Club Donation: 'శెభాష్‌.. మీరు చేస్తున్న కృషికి అభినందనలు' - శిశు మంగళ్‌ అనాథాశ్రమాన్ని అభినందించిన అనితా ఖారా

SBI Ladies Club Donation: అనాథ పిల్లలను సంరక్షించడంలో గోపన్​పల్లిలోని శిశు మంగళ్‌ అనాథాశ్రమం చేస్తున్న కృషిని ఆల్‌ ఇండియా ఎస్‌బీఐ లేడిస్‌ క్లబ్‌ అధ్యక్షురాలు అనితా ఖారా అభినందించారు. అనాథాశ్రమంలోని పిల్లల యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎస్​బీఐ లేడిస్‌ క్లబ్‌ తరఫున రూ.5 లక్షల విలువచేసే బియ్యం, బట్టలు, సైకిళ్లు, స్వెటర్లు, యోగా మ్యాట్స్​ను అందజేశారు.

SBI Ladies Club Donation
SBI Ladies Club Donation
author img

By

Published : Dec 28, 2021, 10:58 PM IST

SBI Ladies Club Donation: అనాథ పిల్లలను సంరక్షించడంలో గోపన్​పల్లిలోని శిశు మంగళ్‌ అనాథాశ్రమం చేస్తున్న కృషిని ఆల్‌ ఇండియా ఎస్‌బీఐ లేడిస్‌ క్లబ్‌ అధ్యక్షురాలు అనితా ఖారా అభినందించారు. రంగారెడ్డి జిల్లా గోపన్​పల్లిలోని ఆనాథాశ్రమాన్ని అనితా ఖారాతో పాటు తెలంగాణ రాష్ట్ర లేడిస్‌ క్లబ్‌ అధ్యక్షురాలు నుపుర్‌ ఝింగ్రాన్‌ సందర్శించారు. అనాథాశ్రమంలోని 27మంది బాలికలు, 15 మంది బాలుర గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు యోగా కూడా నేర్పిస్తున్నట్లు చెప్పారు.

ఈ అనాథాశ్రమానికి ఎస్​బీఐ లేడిస్‌ క్లబ్‌ తరఫున రూ.5 లక్షల విలువచేసే బియ్యం, బట్టలు, సైకిళ్లు, స్వెటర్లు, యోగా మ్యాట్స్​, ఆల్మార్స్‌, కార్పెట్లు, దుప్పట్లు, స్మార్ట్‌ ఫోన్లు, స్టేషనరీ అందజేశారు. ఎన్జీవో అందించే సౌకర్యాలను వినియోగించుకోవాలని అనితా ఖారా కోరారు.

శిశు మంగళ్‌ అనాథాశ్రమాన్ని అభినందించిన అనితా ఖారా

ఇదీ చదవండి: Good news for drinkers: మద్యం ప్రియులకు శుభవార్త.. అర్ధరాత్రి వరకు అమ్మకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.