హైదరాబాద్ చాదర్‌ఘాట్ విక్టోరియా మైదానంలో ఆశ్రయం పొందుతున్న 160 మంది వలస కార్మికులకు సికింద్రాబాద్ ఎస్‌బీఐ పరిపాలనా కార్యాలయ సిబ్బంది ఆపన్నహస్తం అందించారు. ఉద్యోగులందరు కలిసికట్టుగా రూ.75 వేలు జమచేసి కార్మికులకు అవసరమైన దుప్పట్లు, టవళ్లు, సబ్బులు, టూత్‌పేస్ట్ వంటి వాటిని కొనుగోలు చేశారు. హైదరాబాద్ సర్కిల్ సీజీఎం ఓపీ మిశ్రాతో కలిసి డీజీఎం వనిత భట్టా ఛటర్జీ, హిమాయత్‌నగర్ ఆర్‌ఎం ఉషాశంకర్, ఏజీఎం హనుమంతరావులు సరుకులు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: 'కరోనా అయితే నాకేంటి? నా దగ్గరకు అది రాలేదు'