దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలు, ప్రముఖ సంఘసంస్కర్త సావిత్రి బాయి పూలే 189 జయంతి వేడుకలను హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలు మణి మంజరిసాగర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బీసీ మహిళలు తరలిరావాలని ఆమె కోరారు.
సావిత్రి బాయి పూలే అసమాన సేవలను కీర్తిస్తూ జనవరి 2 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఉత్సవాలు నిర్వహిస్తామని మణి మంజరిసాగర్ తెలిపారు. సమసమాజ స్థాపన కోసం, అణగారిన వర్గాల ప్రజల కోసం, మహిళా సాధికారత కోసం సావిత్రి తన జీవితం ధారపోశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి బీసీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఈటెల రాజేందర్, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితర ముఖ్య నాయకులు హాజరు కానున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
ఇదీ చదవండి: 'ఈ లఘు చిత్రం మహిళల్లో ధైర్యాన్ని పెంపొందిస్తుంది'