ETV Bharat / state

ఉమ్మడి చెక్​పవర్​ను రద్దుచేయండి: సర్పంచు​ల సంఘం - ఉమ్మడి చెక్​పవర్​ను రద్దుచేయండి

ఉమ్మడి చెక్​ పవర్​ ఇవ్వడం వల్ల సర్పంచ్​, ఉపసర్పంచ్​ల మధ్య ఆధిపత్య పోరు ఏర్పడిందని సర్పంచుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. తక్షణమే ఉమ్మడి చెక్​పవర్​ను రద్దుచేయాలని డిమాండ్​ చేశారు. సర్పంచుల గౌరవ వేతనాన్ని రూ. 20 వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

ఉమ్మడి చెక్​పవర్​ను రద్దుచేయండి: సర్పంచుల సంఘం
author img

By

Published : Aug 22, 2019, 11:31 PM IST

ఉమ్మడి చెక్​పవర్​ వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని పంచాయతీ సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షుడు భూమన్న యాదవ్​ తెలిపారు. హైదరాబాద్​ బషీర్​బాగ్​ ప్రెస్​క్లబ్​లో నూతన సర్పంచ్​లతో ఆయన ప్రమాణస్వీకారం చేయించారు. ఇప్పటికే సర్పంచ్​, ఉపసర్పంచ్​ల మధ్య ఆధిపత్య పోరు నెలకొందన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్​లో పరిపాలన ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఏకగ్రీవమైన సర్పంచు​లకు ప్రకటించిన నజరానా వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బంగారు తెలంగాణ సాధనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరవేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఉమ్మడి చెక్​పవర్​ను రద్దుచేయండి: సర్పంచుల సంఘం

ఇవీ చూడండి: 'వ్యవసాయరంగ సమస్యలపై దేశవ్యాప్త నిరసన'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.