హైదరాబాద్ మెహదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి సన్మానం చేశారు. తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆర్గనైజేషన్ ఫౌండర్ మహమ్ముద్ నజీబ్... వైద్యులను పూలతో సత్కరించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యులు చేస్తున్న సేవ ఎంతో విలువైనదని కొనియాడారు. కరోనా కట్టడి కోసం కృషిచేస్తోన్న వైద్యులందరికీ తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆర్గనైజేషన్ తరఫున నజీబ్ కృతజ్ఞతలు తెలిపారు.