సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం సరస్వతీ దేవిగా అమ్మవారు భక్తులందరికీ దర్శనమిచ్చారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మహంకాళి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. సరస్వతి దేవి చల్లని కరుణ తమపై ఉండాలని, విద్యాబుద్ధులు నెలకొనాలంటూ భక్తులు కోరుకున్నారు. అమ్మవారికి బంగారు కిరీటం, పట్టు చీరలు, వివిధ రకాల పండ్లు, పుష్పాలతో అలంకరణలో అమ్మవారు సుందరంగా కనిపించారు.
ఇదీ చదవండిః మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు