రసూల్‌పురాలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. రంగోలి, మెహందీ, వంటలు, పాటలు తదితర పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతులు అందజేశారు. తెలంగాణ ఉమెన్ సేఫ్టీ ఎస్పీ సుమతి, బోర్డు సభ్యుడు సదా కేశవ రెడ్డి హాజరయ్యారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల వల్ల సమాజంలో సామాజిక స్పృహ పెరుగుతుందని ఎస్పీ సుమతి పేర్కొన్నారు.
ఇవీ చూడండి: మన అన్నదాతకు పండగెక్కడయ్యా?