హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సంకల్ప్ ఫౌండేషన్‌తో కలిసి మేజ్బార్ రెస్టారెంట్ నిర్వాహకులు వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిరుపేదలు, రోజూవారి కూలీలకు స్థానిక పోలీసుల సహకారంతో సుమారు 1500 మందికి ఆహార పొట్లాలను అందజేశారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని సిరోల్ గ్రామంలోనూ నిత్యావసర సరుకులతో పాటు శానిటైజర్ కిట్లను ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు శివానంద రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చూడండి : క్షౌరశాలలు లేకుంటేనేం.. మీకు నేనున్నానంటున్న మహిళ.!