కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన వద్ద అద్భుతమైన మెడిసిన్ ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పీసీసీ అధ్యక్ష పదవికి తన పేరు పరిగణలోకి తీసుకోవాలని ఏఐసీసీకి తెలిపినట్లు చెప్పారు. ఈ నెల 16న ఏఐసీసీ ముఖ్య సమావేశం దిల్లీలో ఉందని.. తన బయోడేటాను ఏఐసీసీ పెద్దలకు పంపించానని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతోపాటు పలువురికి బయోడేటా ప్రతులను పంపించినట్లు వివరించారు.
తనకు పీసీసీ ఇస్తే.. ఏలాంటి షరతులు లేకుండా రాహుల్, సోనియా చెప్పినట్లు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. లోక కల్యాణం కోసమే పీసీసీ అధ్యక్ష పదవి అడుగుతున్నట్లు జగ్గారెడ్డి చెప్పారు.
ఇవీ చూడండి: 'శబరిమల' కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ