ETV Bharat / state

ఎన్నికలున్నాయనే నిధులు విడుదల చేశారు: జగ్గారెడ్డి

జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూ.550 కోట్లను సీఎం విడుదల చేశారని జగ్గారెడ్డి ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుంటే... కేవలం జంట నగరాలకే నిధులు పరిమితం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

sangareddy-mla-jagga-reddy-fire-on-telangana-government
జీహెచ్​ఎంసీలో ఎన్నికలున్నాయనే నిధులు విడుదల చేశారు: జగ్గారెడ్డి
author img

By

Published : Oct 20, 2020, 4:51 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రూ.550 కోట్లను విడుదల చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. భారీ వర్షాలతో ఇళ్లలోకి నీరొచ్చి, పంటలు మునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదని ఆయన విమర్శించారు.

జీహెచ్​ఎంసీలో ఎన్నికలున్నాయనే నిధులు విడుదల చేశారు: జగ్గారెడ్డి

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో... అధికారులు ఉన్నారో లేరో... అనే అనుమానం కలుగుతోందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే... ప్రజలు ఎలా ఉన్నారో, పంటలు దెబ్బతిని రైతులు ఎట్లున్నారో తెలుసుకోడానికి కూడా... ముఖ్యమంత్రి చొరవ చూపించట్లేదని ఆయన ఆరోపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుంటే... పంటలు దెబ్బతిని రైతులు అల్లాడిపోతుంటే.. కేవలం జంటనగరాలకే రూ.550 కోట్లు విడుదల చేయడమేంటి అంటూ ప్రశ్నించారు. జీహెచ్​ఎంసీ దృష్టిలో పెట్టుకునే నిధులు పేరిట డబ్బులు విడుదల చేశారని ఆరోపించారు.

ఇదీ చూడండి: అధైర్య పడొద్దు.. ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.