ప్రముఖ చిత్రకారుడు సుమంతో చౌదరి ఏర్పాటు చేసిన ప్రదర్శనను మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ ప్రారంభించారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో 'మై పిక్టోరియల్ స్పేస్' పేరిట సుమంతో చౌదరి ఈ చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ప్రముఖ రచయిత్రి అంజూ పొద్దర్, ప్రముఖ చిత్రకారులు లక్ష్మణ్‌గౌడ్, లక్ష్మణ్ ఏలె, సుధాకర్, నగేష్‌గౌడ్‌లతో కలిసి ప్రదర్శనలో కొలువుదీరిన కళాకృతులను శైలజా పరిశీలించారు.
పల్లెటూరి అందాలు, ప్రాచీన కట్టడాలు, ప్రకృతి సొబగులకు ప్రాణం పోసేలా.. సుమంతో చౌదరి గీసిన చిత్రాలు వీక్షకులను కనువిందు చేస్తున్నాయని శైలజా కిరణ్ అన్నారు. తన కుంచె నుంచి జాలువారిన వివిధ రకాల పెయింటింగ్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. కలర్ పెన్సిల్‌తో కాగితంపై ఆవిష్కరించిన ప్రకృతి అందాలు, పట్టణ ప్రాంతాల్లోని కట్టడాలు, బహుళ అంతస్తు నిర్మాణ ఆర్కిటెక్చర్ ఆకట్టుకున్నాయని తెలిపారు. సుమంతో చౌదరి ప్రతిభను చూసి ఆశ్చర్యానికి గురయ్యాననీ.. ప్రతి చిత్రం, శిల్పం చూడముచ్చటగా ఉందని శైలజా కిరణ్ పేర్కొన్నారు.
ల్యాండ్‌స్కేప్, సిటీ స్కేఫ్, మీనియేచర్ వర్క్.. ఇలా వేర్వేరు అంశాలను ప్రతిబింబిస్తూ చిత్రాలను ఆవిష్కరించినట్లు చిత్రకారుడు సుమంతో చౌదరి తెలిపారు. తన మదిలో మెదిలిన భావాలను కాన్వాస్‌పై తీర్చిదిద్దినట్లు వివరించారు. మై పిక్టోరియల్ స్పేస్ పేరిట ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో 75 కళాకృతులు కొలువుదీరాయి. ఈ నెల 10వరకు కొనసాగుందని నిర్వహకులు తెలిపారు.
"చిత్రకారుడు సుమంతోచౌదరి గీసిన చిత్రాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ప్రతిచిత్రం, శిల్పం వైవిధ్యం. ఎంతో ఆలోచించి కొన్ని నెలల తరబడి శ్రమిస్తే గానీ ఇంత అద్భుత చిత్రాలను ఆవిష్కరించడం కష్టం. విభిన్న మాధ్యమాల్లో గీసిన బొమ్మలు చూడముచ్చటగా ఉన్నాయి." -శైలజా కిరణ్ మార్గదర్శి ఎండీ
ఇవీ చూడండి: