ETV Bharat / state

సీఎం, మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగులు

సహకార శాఖలో పలువురు ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్ రెడ్డికి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రుల నివాస సముదాయంలో నిరంజన్ రెడ్డిని కలిసి శాలువా కప్పి అభినందించారు.

cm kcr Minister niranjan reddy, sahakara Employees
సీఎం, మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగులు
author img

By

Published : Mar 30, 2021, 7:51 PM IST

సహకార శాఖలో నూతన అధ్యాయం.. పదోన్నతుల్లో కొత్త చరిత్ర అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రెండేళ్లలో 90 మంది గెజిటెడ్ అధికారులకు డిప్యూటీ రిజిస్ట్రార్లుగా పదోన్నతి కల్పించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ సహకార గెజిటెడ్ అధికారుల రాష్ట్ర సంఘం అధ్యక్షులు ఎన్నమనేని జగన్‌మోహన్‌రావు నేతృత్వంలో.. సహకార శాఖ ఉద్యోగులు మంత్రిని కలిశారు. ఏళ్లుగా మూలన ఉన్న సమస్యలకు పరిష్కారం లభించడం పట్ల ఉద్యోగులు సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి.భీం రాజ్, అసోసియేట్ అధ్యక్షుడు నాగేశ్వర్ రావు, ఉపాధ్యక్షులు సంజీవరెడ్డి, ఈగ వెంకటేశ్వర్లు, ఆంజనేయులు పాల్గొన్నారు.

రెండేళ్ల కాల వ్యవధిలో సుమారు 90 మందికి గెజిటెడ్ అధికారులకు డిప్యూటీ రిజిస్ట్రార్లు, స్పెషల్ కేటగిరి డిప్యూటీ రెజిస్ట్రార్లుగా పదోన్నతి ఇవ్వడం రాష్ట్రంలోనే మొదటిసారి అన్నారు. ఈ ఘనత మంత్రికి దక్కిందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా డిప్యూటీ రిజిస్ట్రార్ల సీనియారిటీ విషయంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సున్నితమైన అంశాన్ని పరిష్కరించడానికి మంత్రి ప్రత్యేకంగా ఓ కమిటీని వేశారని కొనియాడారు. సమస్యను పరిష్కరించి 61 మంది డీఆర్‌ నుంచి ఎస్‌సీఆర్‌డీలుగా పదోన్నతి పొందడానికి ప్రత్యేక చొరవే కారణమని ప్రశంసించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించినందుకు సహకార శాఖ ఉద్యోగుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి : యాదాద్రి ఆలయంలో మరో 10 మంది ఉద్యోగులకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.