విహర యాత్రలో విషాదం చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం పడవ ప్రమాదంలో 12 మంది హైదరాబాద్ వాసులు సురక్షితంగా బయటపడ్డారు. జగద్గిరి గుట్ట, మాదాపూర్, ఉప్పల్, హయత్ నగర్, ప్రగతినగర్ నుంచి మొత్తం 22 మంది ఆ పడవలో పాపికొండలకు విహార యాత్రకు వెళ్లారు. ప్రయాణంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో 9 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అలాగే 14 మందిగా వెళ్లిన వరంగల్ బృందంలో ఐదుగురు సురక్షితంగా చేరుకోగా.. 9 మంది ఆచూకీ లభ్యం కాలేదు. అటు మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు.. ఖమ్మం జిల్లాకు చెందిన మరొకరు గల్లంతైనట్లు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పడవలో 73 మంది ప్రయాణించగా 26 మంది సురక్షితంగా బయటపడగా.. 39 మంది ఆచూకీ గల్లంతయింది.
సురక్షితంగా బయటపడ్డవారి వివరాలు:
సంఖ్య | పేరు | ప్రాంతం |
1 | జానకిరామారావు(65) | ఉప్పల్, హైదరాబాద్ |
2 | సోతాటి రాజేశ్(24) | సనత్ నగర్, హైదరాబాద్ |
3 | నల్లాపురం సురేశ్(31) | జగద్గిరి గుట్ట, హైదరాబాద్ |
4 | ముజురుద్దీన్(28) | హైదరాబాద్ |
5 | మేడి కిరణ్ కుమార్(29) | హైదరాబాద్ |
6 | పాడి జరణి కుమార్(21) | హైదరాబాద్ |
7 | కోదండ అర్జున్(23) | హైదరాబాద్ |
8 | కోదండ విశాల్(25) | హైదరాబాద్ |
9 | అక్బల్ | మియాపూర్, హైదరాబాద్ |
10 | మోయిన్గర్ | టోలిచౌకి, హైదరాబాద్ |
11 | హేమంత్ | హైదరాబాద్ |
12 | దర్శనాల సురేశ్(29) | కాజీపేట, వరంగల్ |
13 | బి.దశరథం(52) | కాజీపేట, వరంగల్ |
14 | బి.వెంకటస్వామి(60) | కాజీపేట, వరంగల్ |
15 | గొర్రె ప్రభాకర్(47) | కాజీపేట, వరంగల్ |
16 | ఆరవల్ల యాదగిరి(42) | కాజీపేట, వరంగల్ |
17 | గల్లా శివశంకర్(25) | కోదాడ, సూర్యాపేట |
గల్లంతైనవారు:
సంఖ్య | పేరు | ప్రాంతం |
1 | హిమ సాయి కుమార్ | మాదాపూర్, హైదరాబాద్ |
2 | తాలిబ్ పటేల్ | టోలిచౌకి, హైదరాబాద్ |
3 | పవన్ | మేడిపల్లి, హైదరాబాద్ |
4 | వసుంధర (పవన్ భార్య) | మేడిపల్లి, హైదరాబాద్ |
5 | సుషీల్ (పవన్ కుమారుడు) | మేడిపల్లి, హైదరాబాద్ |
6 | భరణి కుమార్ | హయత్ నగర్, హైదరాబాద్ |
7 | రేపాక విష్ణు | ఖమ్మం జిల్లా |
8 | రమ్య శ్రీ | మంచిర్యాల జిల్లా |
9 | బొడ్డు లక్ష్మణ్ | మంచిర్యాల జిల్లా |