టీఆర్టీ అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీఎస్‌పీఎస్సీ అధికారులతో మాట్లాడారు. టీఆర్టీ అభ్యర్థుల సమస్య కోర్టులో పరిష్కారమైనందున జాబితా విడుదల చేయాలన్నారు. టీఆర్టీ అభ్యర్థుల ఎంపిక జాబితాలను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. అభ్యర్థులు ఆందోళనలు చేయొద్దని, సంయమనం పాటించాలని సూచించారు.
ఇవీ చూడండి: త్రిసభ్య కమిటీతో చర్చలు విఫలం... 5 నుంచి సమ్మె