రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. కొత్తూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం షాద్నగర్లో టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
అక్కడి నుంచి జిల్లేడు చౌదరగూడ మండలం జిల్లేడులో ప్రభుత్వ పాఠశాలలో ఎన్ఆర్ఐ దాత పొట్టి శ్రీనివాస్ తన తండ్రి జ్ఞాపకార్థం రూ.18 లక్షలతో నిర్మించిన రెండు తరగతి గదులు, వంట గదిని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతను ఆమె అభినందించారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
దుకాణ యజమానుల సమస్యలు మంత్రి దృష్టికి: కొత్తూరు వై జంక్షన్ నుంచి షాద్‌నగర్ పురపాలిక శివారులో గల సోలిపూర్ వైజంక్షన్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణలో భాగంగా షాద్‌నగర్ పురపాలికలో భవనాలు కోల్పోతున్న యజమానులు మంత్రికి తమ గోడు వినిపించారు. విస్తరణ తగ్గించాలని, పరిహారం చెల్లించాలని మంత్రిని కోరారు. ఎన్హెచ్ఏఐ నిబంధనల ప్రకారం రోడ్డు విస్తరణ పనులు జరుగుతాయన్నారు. వారి నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించాలా వద్దా అనే విషయం ప్రకారం నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇవీ చదవండి: