SAJJANAR NEW YEAR CELEBRATIONS : ఆర్టీసీ బస్సులో మనకు ఎన్నో అనుభవాలు ఉంటాయని.. ఇతరులతో పరిచయాలు ఏర్పడి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు సెల్‌ఫోన్ వచ్చిన తర్వాత బస్సులో పక్కవారితో మాట్లాడే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా మహాత్మా గాంధీ బస్‌స్టేషన్‌లో ప్రయాణికులతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన పలువురు ఉద్యోగులను సత్కరించారు.
ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. సౌకర్యాలపై ఆరా తీశారు. దీంతో పాటు ఆర్టీసీ అందిస్తున్న సౌకర్యాలను తెలిపే విధంగా తయారు చేసిన ప్రచార రథాన్ని ఆయన ప్రారంభించారు. కళాబృందాన్ని అభినందించారు. ఆర్టీసీలో ప్రజల సౌకర్యార్థం ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు తెచ్చామని.. భవిష్యత్తులో మరికొన్ని కార్యక్రమాలతో ముందుకు వస్తామని తెలిపారు. ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఉద్యోగులు రేయింబవళ్లు కష్టించారని ఆయన తెలిపారు.
"2022లో ప్రయాణికులు అంతా ఆర్టీసీకి ఎంతగానో సహకరించారు. ప్రయాణికులు అందరూ ఆర్టీసీని ఎంతగానో ఆదరించారు. వారు సంస్థకు బ్యాక్‌బోన్‌గా నిలబడి.. ముందు నిలిచారు. గాడిలో పెట్టాలనుకున్న సంస్థకు ఉద్యోగులు ఎంతగానో సహకరించారు. రాఖీ పౌర్ణమి రోజు రికార్డ్ స్థాయిలో 44 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణించారు." - సజ్జనార్, ఆర్టీసీ ఎండీ
ఇవీ చదవండి: