ఆర్టీసీపై లాక్‌డౌన్ తీవ్ర ప్రభావం చూపింది. 4 గంటలు మాత్రమే ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడంతో జిల్లాలకు కేవలం 1100 సర్వీసులు మాత్రమే నడిపారు. అంతకుముందు సుమారు 6వేల పైచిలుకు బస్సులు తిరిగేవి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ విధించడంతో ఆ రాష్ట్రానికి సర్వీసులు రద్దు చేశారు. దానికితోడు రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం తగ్గినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
గ్రేటర్ పరిధిలో గతంలో 2 వేల 700ల పైచిలుకు నడిచే బస్సులు... లాక్‌డౌన్ కారణంగా 600 బస్సులు మాత్రమే తిప్పారు. ఇందులోనే జీహెచ్ఎంసీ, వైద్య సిబ్బందికి 150 బస్సులను నడుపుతున్నారు. ఇప్పటికే నష్టాల్లో కొనసాగుతున్న సంస్థకు లాక్‌డౌన్‌తో... మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైనట్లు కార్మికనేతలు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: తెలంగాణలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది : హర్షవర్ధన్