యూనియన్లు పెట్టుకునే హక్కు ప్రతి కార్మికునికి ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ.హనుమంతరావు పేర్కొన్నారు.కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా హైదరాబాద్ నాంపల్లి కలెక్టరేట్ ముందు వామపక్ష నేతలు, కార్మికులతో కలిసి వీహెచ్ మహాధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ మానిక్రాజ్కు జేఏసీ నేతలు వినతి పత్రం అందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీ ఆస్తులను అమ్ముకునేందుకే ప్రభుత్వం కార్మికులను రోడ్డుమీదకు తీసుకొచ్చిందని వీహెచ్ విమర్శించారు. పండుగలు జరుపుకోనివ్వకుండా ఆర్టీసీ కార్మికులను, కుటుంబాలను సీఎం కష్టపెడుతున్నారని వీహెచ్ అన్నారు.
ఇదీ చదవండిః 'నిమ్స్ నుంచే నిరాహార దీక్ష కొనసాగిస్తా'