ఆర్టీసీ జేఏసీ అత్యవసర సమావేశం జరిగింది. డిపోల వద్ద కార్మికుల ఆందోళనలు, అరెస్టులపై ప్రధానంగా చర్చించారు. సమ్మె విరమించి విధులకు హాజరయ్యేందుకు వచ్చినా... వెనక్కి పంపడం సరికాదన్నారు. ఈ విషయంలో ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ వ్యాఖ్యలను తప్పుపట్టారు. కార్మికులు ఇష్టమొచ్చినప్పుడు సమ్మె చేయడం... ఇష్టమొచ్చినప్పుడు విధులు నిర్వహించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. కార్మిక సంఘాలకు సమ్మె నోటీసు ఇచ్చే హక్కు ఉందని.. తాము కార్మిక నిబంధనల ప్రకారమే నడుచుకున్నామన్నారు. కార్మికుల అరెస్టును జేఏసీ తరపున ఖండించారు.
ప్రభుత్వ తీరును ఖండించిన ఆర్టీసీ జేఏసీ
14:54 November 26
ఆర్టీసీ ఐకాస అత్యవసర సమావేశం