ETV Bharat / state

ఆస్తులు కాపాడబోయాడు.. పెద్దల ఆగ్రహానికి గురయ్యాడు.. - RTC land worth crores of rupees in Bapatla

RTC Land Issue In Bapatla: తాను పనిచేస్తున్న సంస్థ ఆస్తులను కాపాడటమే ఆ అధికారికి శాపంగా మారింది. ఆస్తులు పరిరక్షించిన అధికారి అంకితభావాన్ని ప్రశంసించకపోగా.. విధుల నుంచి తప్పించారు. బాపట్లలో కోట్లాది రూపాయల విలువైన ఆర్టీసీ స్థలాన్ని కాపాడుకునేందుకు అధికార పార్టీ నేతలకు ఎదురు నిలిచిన డీఎం శ్రీనివాసరెడ్డిని బదిలీ చేయడంపై ఉద్యోగ, కార్మిక వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

RTC Land Issue In Bapatla
RTC Land Issue In Bapatla
author img

By

Published : Dec 25, 2022, 5:41 PM IST

ఆస్తులు కాపాడబోయాడు.. పెద్దల ఆగ్రహానికి గురయ్యాడు..!

RTC Land Issue In Bapatla: బాపట్ల ఆర్టీసీ స్థలంలో వైసీపీ జిల్లా కార్యాలయం నిర్మాణాన్ని అడ్డుకునేందుకు యత్నించిన ఆర్టీసీ డీఎం శ్రీనివాసరెడ్డి బదిలీ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ రంగ ఆస్తులను కాపాడేందుకు యత్నించిన డీఎం శ్రీనివాసరెడ్డిని ఉన్నతాధికారులు, ప్రభుత్వం ప్రశంసించాల్సిందిపోయి.. ఆయన చేసిన పనే పెద్ద నేరంగా పరిగణిస్తూ ఆ పోస్టు నుంచి తప్పించి, ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు.

ఈ వ్యవహారంపై ఆర్టీసీ సిబ్బంది, కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1990లో బాపట్లలో ఏపీఐఐసీ నుంచి ఆర్టీసీ 10.62 ఎకరాలను కొనుగోలు చేసింది. ఇందులో 6.54 ఎకరాల్లో గ్యారేజీ నిర్మించగా.. మిగిలిన 4.08 ఎకరాలను భవిష్యత్తు అవసరాల కోసం అట్టిపెట్టుకుంది. ఖాళీగా ఉన్న ఈ స్థలాన్ని వెనక్కి తీసుకుంటామంటూ 2003లో ఏపీఐఐసీ ఆర్టీసీకి నోటిసులిచ్చింది. వివిధ పన్నులు, నిర్వహణ వ్యయం తదితరాలు మినహాయించి రూ.3వేల చెక్కును ఆర్టీసీకి ఇచ్చింది.

అయితే భవిష్యత్తు అవసరాలకు ఆ స్థలం కావాలంటూ ఏపీఐఐసీ ఇచ్చిన ఆ చెక్కును ఆర్టీసీ వెనక్కి పంపింది. అప్పటి నుంచి ఆ భూమి సాంకేతికంగా తమ పరిధిలోనే ఉందని ఆర్టీసీ భావించింది. అయితే ఈ స్థలంలోని రూ.16 కోట్ల విలువైన రెండు ఎకరాల భూమిని ముప్పై మూడున్నరేళ్లకు వైసీపీ కార్యాలయానికి లీజుకిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఏడాది కేవలం రూ. 1000 నామమాత్రపు అద్దె చెల్లించేలా విలువైన స్థలాన్ని అప్పనంగా అప్పగించేసింది.

జిల్లా ఆవిర్భావం నుంచే వైసీపీ నేతలు తెరవెనక తతంగం నడపగా.. ఈనెల 15న బాపట్ల తహశీల్దారు గుట్టుచప్పుడు కాకుండా రెండెకరాల భూమిని వైసీపీకు అప్పగించారు. ఆ స్థలంలో వైసీపీ కార్యాలయానికి భూమి పూజలు చేసే వరకు కనీసం ఆర్టీసీ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వైసీపీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నప్పుడే డీఎం శ్రీనివాసరెడ్డి అభ్యంతరం తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లోనూ, తహశీల్దారుకు ఫిర్యాదు చేశారు.

దీనిపై అధికార పార్టీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. బాపట్లలో ఎలా పనిచేస్తారో చూస్తామంటూ హెచ్చరించారు. దీనిలో భాగంగానే శ్రీనివాసరెడ్డిని డిపో మేనేజర్ బాధ్యతల నుంచి తప్పించడమే గాక.. ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వకుండా ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. తమ భూమిలో వైసీపీ కార్యాలయ నిర్మాణం ఏర్పాటుపై గట్టిగా నిరసన తెలిపామని తొలుత ప్రకటించిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.. సాయంత్రానికే మాటమార్చి ఆ స్థలం తమది కాదంటూ తేల్చి చెప్పారు. మొత్తానికి ప్రభుత్వం, ఆర్టీసీ ఉన్నతాధికారులు కలిసి బాపట్ల డీఎం శ్రీనివాసరెడ్డిని బలిపశువును చేశారంటూ ఆర్టీసీ సిబ్బంది, కార్మికులు మండిపడుతున్నారు. అధికార పార్టీకి అడ్డుచెబితే వేటు తప్పదని హెచ్చరించారంటూ ఉద్యోగ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.