రోడ్డు భద్రత అంటేనే ఆర్టీసీ బలం... ఆర్టీసీ అంటేనే సురక్షిత ప్రయాణానికి చిరునామాగా నిలుస్తోందని హైదరాబాద్ రీజియన్ మేనేజర్ వెంకన్న అన్నారు. ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా హైదరాబాద్ రీజియన్ పరిధిలో డ్రైవర్లకు కాచిగూడలో శిక్షణ తరగతులు నిర్వహించారు.
డ్రైవర్ డ్యూటీలో ఉన్నప్పుడు ఎలాంటి మెలకువలు కలిగి ఉండాలో కొత్త టెక్నాలజీపై అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసే విధంగా డ్రైవర్లకు శిక్షణ ఇచ్చామన్నారు. కరోనా వల్ల సంస్థకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రయాణికులకు మరింత చేరువై తిరిగి పునర్వైభవాన్ని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: ప్రగతిభవన్ ముట్టడికి భాజపా కార్పొరేటర్ల యత్నం