ETV Bharat / state

శంషాబాద్​ విమానాశ్రయం నుంచి ఆర్టీసీ కార్గో సేవలు - ఆర్టీసీతో జీఎంఆర్​ హైదరాబాద్ ఎయిర్ కార్గో ఒప్పందం తాజా వార్తలు

సరకు రవాణా ప్రారంభించిన తెలంగాణ ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఇకపై సరకులను టీఎస్‌ ఆర్టీసీ కార్గో విభాగం ఆయా ప్రాంతాలకు చేరవేయనుంది. ఇందులో భాగంగా... అంతర్జాతీయ ఎగుమతి, దిగుమతి కార్గోను ప్రోత్సహించడానికి జీఎంఆర్​ హైదరాబాద్ ఎయిర్ కార్గో (జీహెచ్​ఓసీ), తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతో శనివారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

rtc cargo service will start from shamshabad airport
శంషాబాద్​ విమానాశ్రయం నుంచి ఆర్టీసీ కార్గో సేవలు
author img

By

Published : Nov 7, 2020, 4:48 PM IST

త్వరలో విమానాశ్రయం నుంచి ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభం కానున్నాయి. జీఎంఆర్​ హైదరాబాద్ ఎయిర్ కార్గో (జీహెచ్​ఓసీ), తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతో శనివారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం జీఎంఆర్​ హైదరాబాద్ ఎయిర్ కార్గో టెర్మినల్‌ నుంచి తెలంగాణలోని ఇతర ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు కార్గో బస్ ఫీడర్ సర్వీస్ (బీఎఫ్​ఎస్​)ను ఏర్పాటు చేస్తారు.

శంషాబాద్​ విమానాశ్రయం నుంచి ఆర్టీసీ కార్గో సేవలు
శంషాబాద్​ విమానాశ్రయం నుంచి ఆర్టీసీ కార్గో సేవలు

ఎంవోయూపై సంతకాలు చేసిన సునీల్ శర్మ, సౌరభ్ కుమార్

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో సీఈవో సౌరభ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ- టీఎస్‌ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఫార్మా, వ్యాక్సిన్లు, పెరిషబుల్స్, ఏరోస్పేస్, ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ వంటి సున్నితమైన సరుకులను నిర్వహించడంలో జీహెచ్​ఏసీ ప్రత్యేకత చాటుకుంది. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం టీఎస్​ ఆర్టీసీ జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో టెర్మినల్‌కు పిక్అప్, డెలివరీ సేవలను ప్రారంభిస్తుంది.

తెలంగాణతో పాటు చుట్టు పక్కల రాష్ట్రాలకు

హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే అంతర్జాతీయ దిగుమతులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని మారుమూల ప్రాంతాలకు అనుసంధానించడానికి కనెక్టివిటీని అందిస్తుంది. ఈ ఒప్పందం ద్వారా హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఫార్మా, పెరిషబుల్ ఉత్పత్తుల ఎగుమతులకు విశ్వసనీయమైన కనెక్టివిటీని అందించే రీఫర్ కార్గో బస్ సర్వీస్‌ను కూడా ప్రారంభించే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

గొప్ప ప్రారంభం

తెలంగాణలోని మెరుగైన రోడ్డు రవాణా సదుపాయాలు, ప్రపంచ స్థాయి సౌకర్యాలు, అంతర్జాతీయ కనెక్టివిటీ కలిగిన హైదరాబాద్ ఎయిర్ కార్గో కలిసి అంతర్జాతీయ ఎయిర్ కార్గో వాణిజ్యం చేసే వారందరికీ నూతన వ్యాపారావకాశ ద్వారాలను తెరుస్తుంది. ఈ ఒప్పందం సహకార విధానం ద్వారా వాణిజ్య వర్గాలకు ప్రయోజనం చేకూర్చి, హైదరాబాద్ నుంచి ఎగుమతి, దిగుమతులను పెంచనుంది. టీఎస్​ ఆర్టీసీ-జీఎంఆర్ ​మధ్య అద్భుతమైన భాగస్వామ్యానికి ఇదొక గొప్ప ప్రారంభమని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు.

ఇదీ చదవండి: బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యంతర సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.