విద్యావిధానం వ్యక్తిజీవన విధానానికి మార్గనిర్దేశం చేస్తోందని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. హైదరాబాద్ బండ్లగూడలో జరిగిన శిశుమందిర్ పూర్వవిద్యార్థుల మహా సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పూర్వవిద్యార్థుల సమ్మేళనాలు వ్యక్తిగత ఆనందం కల్గిస్తాయని భగవత్ తెలిపారు.
విద్యాభారతిలో అభ్యసించిన విద్యార్థులకు నైతిక, జీవన విలువలు పెంపొందుతాయన్నారు. తనకుతాను పరిశీలన చేసుకోకుండా కోరికల వెంబడి వెళ్తే... తాత్కాలిక జీవన విధానం లభిస్తుందని వివరించారు. వ్యక్తి ఏ ఉన్నతమైన పదవిలో ఉన్నా... చేసే పనిని నిస్వార్థంగా చేయాలని మోహన్ భగవత్ సూచించారు.
ఇవీ చూడండి: 'దేశంలో సిద్ధాంతపరమైన సంఘర్షణ జరుగుతోంది'